ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!
Breaking News
ప్రశాంత్ కిషోర్‌పై పరువు నష్టం దావా వేసిన మంత్రి
Published on Tue, 06/03/2025 - 20:56
పాట్నా: జన్ సూరజ్ పార్టీ(జెఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. అశోక్ చౌదరి గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్ కోసం లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లంచం ఇచ్చారంటూ పీకే ఆరోపించారు.
దీంతో తనపై అసత్యపు ఆరోపణలు చేసి, తన పరువు నష్టం కలిగించినందుకు దావా వేసినట్లు అశోక్ చౌదరి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువు చేస్తూ.. ఆధారాలు చూపాలంటూ ఆయన సవాల్ విసిరారు.
ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను అశోక్ చౌదరి తిప్పికొడుతూ.. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిశోర్ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, మంత్రి కుమార్తె శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు.
Tags : 1