Breaking News

ట్రైన్‌లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు..

Published on Wed, 01/18/2023 - 12:51

రోజూ బస్టాండ్, రైల్వే స్టేషన్‌, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద అనేక మంది హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్స్్‌) తారసపడుతుంటారు. వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటూ దూరంగా వెళ్తుంటారు. చాలా వరకు హిజ్రాలు జనాలను ముఖ్యంగా అబ్బాయిలను వేధించి మరీ డబ్బులు లాక్కుంటారు. ఇవ్వకుంటే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. వారిలో మంచివారు కూడా ఉంటారు. అంతేగాక హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారూ లేకపోలేదు. అంటే హిజ్రాలు ప్రవర్తించే తీరును బట్టే వారిని చూసే కోణం మారుతుంటుంది. 

తాజాగా ట్రాన్స్‌జెండర్లు ఓ మంచి పని చేసి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. ట్రైన్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్తోంది.  రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి.

గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త.. సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రదేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది. ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు.
చదవండి: విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్‌..104 సార్లు ఫెయిల్‌..105వ సారి శభాష్‌ అనిపించుకున్నాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)