బిహార్‌ ఎన్నికలు.. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Published on Thu, 11/06/2025 - 15:50

బిహార్‌ తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లఖిసరాయ్‌లో బీజేపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం విజయ్‌ సిన్హా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఖోరియారి గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో విజయ్ కుమార్ సిన్హా కారును చుట్టుముట్టిన ఆర్జేడీ మద్దతు దారులు కాన్వాయ్‌పై చెప్పులు కూడా విసిరారు. ఆర్‌జేడీ మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ విజయ్‌ సిన్హా మండిపడ్డారు. గూండాలు నన్ను గ్రామానికి వెళ్లనివ్వడం లేదు. నా పోలింగ్ ఏజెంట్‌ను గ్రామంలోకి అనుమతించలేదు. ఓటు వేయనివ్వలేదు. మా పోలింగ్ ఏజెంట్‌ను తరిమికొట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్‌ కుమార్‌ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. అధికార ఎన్‌డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యం మొదటి దశలో తేలనుంది. 45,241 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

ఇవాళ ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి పోటీచేస్తున్న నియోజకవ ర్గాల్లోనూ గురువారం తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)