Breaking News

బిహార్‌ ప్రచారానికి తెర

Published on Mon, 11/10/2025 - 01:53

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ రాజకీయ పారీ్టల నినాదాలు, ప్రసంగాలతో హోరెత్తిపోయిన గ్రామాలు, పట్టణాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరిదైన రెండో దశ పోలింగ్‌ ఈ నెల 11వ తేదీన 122 నియోజవర్గాల్లో జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్‌ నమోదైంది. రెండో దశలో కీలక నేతలు పోటీపడుతున్నారు. బిహార్‌ ఎన్నికల చరిత్రలో 5 శాతానికి మించి ఓటింగ్‌ పెరిగిన ప్రతిసారీ.. అది అధికార మారి్పడికే దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈసారి భారీ ఓటింగ్‌ నమోదు కావడం తమకే అనుకూలమని ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   

సమీకరణాల చదరంగం  
రెండో దశలో పోలింగ్‌ జరుగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్‌ అత్యంత కీలకం. కిషన్‌గంజ్, అరారియా, పూరి్ణయా, కతిహార్‌ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమికి కంచుకోట. అయితే, 2020 నాటి ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఓవైసీ నేతత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకొని మహాగఠ్‌బంధన్‌ ఓట్లను చీల్చింది.

మైనారిటీల ఓట్లను ఆకర్శించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎంఐఎం సైతం అదే ఓటు బ్యాంకుకు గాలం వేస్తోంది. ఈ ’ఓట్ల చీలిక’అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం–యాదవ్‌ సమ్మేళనం మహాగఠ్‌బంధన్‌కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత రెండు దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది.  భూమిహార్, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఓట్ల చీలికలతో తంటాలు  
ఈ ఎన్నికల్లో ‘ఓట్లను చీల్చే’పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన సురాజ్‌ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడని ఓటర్లను ఆకర్శిస్తోంది. ఈ పారీ్టతో జేడీ(యూ), ఆర్జేడీలకు కొంత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సన్‌ ఆఫ్‌ మల్లా’గా పిలుచుకునే ముకేశ్‌ సహానీ.. బిహార్‌ నిషాద్‌ (మత్స్యకార) వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉండటం ఆర్జేడీకి కలిసొచ్చే అంశం.  

సమస్యాత్మక ప్రాంతాలు 
రెండో దశలో పోలింగ్‌ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ వంటి జిల్లాలు నేపాల్‌ సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్‌. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్‌ సరిహద్దును మూసివేశారు. అసాంఘీక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్‌ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)