Breaking News

బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..

Published on Mon, 08/11/2025 - 07:27

పట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.

తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం‘ఎక్స్‌’లోచేసిన ఒక పోస్ట్‌లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్‌లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో  పేరు  ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి  ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.

రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై  ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్‌ కమిషన్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో  ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్‌ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు.

 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)