Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ..

Published on Wed, 03/26/2025 - 09:45

పట్నా: బీహార్‌ బోర్డు(Bihar Board) తాజాగా 12వ తరగతి ఫలితాలను విడుదలు చేసింది. పెళ్లిళ్లలో మేళతాళాలు వాయించే వ్యక్తి కుమార్తె సంజనా కుమారి ఈ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆర్ట్స్‌ గ్రూపులో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. సంజన 93.6శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది.  ఆమె భవిష్యత్‌లో ఐఏఎస్‌ కావాలనుకుంటోంది.

సంజనా కుమారి మోతీపూర్‌ పరిధిలోని అంజనాకోట్‌లో ఉంటోంది. కుటుంబంలోని ముగ్గురు సంతానంలో ఆమె మూడవది. సంజనా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు దీపక్‌ ఇటీవలే ప్రభుత్వ టీచర్‌(Government teacher)  ఉద్యోగం సంపాదించాడని తెలిపింది. మరో సోదరుడు కూడా చదవులో ప్రతిభ చూపిస్తున్నాడని పేర్కొంది. ఇష్టంగా కష్టపడి చదవితేనే మంచి స్కోరు సాధించగలమని సంజన స్పష్టం చేసింది.

పరీక్షల్లో తాను రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచానని తెలియగానే ఎంతో ఆనందించానని, ఇంట్లోని వారికి ఈ విషయం తెలిసి, ఎంతో సంబరపడ్డారని సంజన పేర్కొంది. ఇండియా టీవీ కథనంలోని వివరాల ప్రకారం సంజన తన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని, వారి మార్గదర్శకత్వంలో చదివి, తాను ఉత్తీర్ణత సాధించానని వివరించింది. తాను పరీక్షలకు ముందు రోజుకు 10 నుంచి 12 గంటలపాటు చదివేదానినని, సెల్ఫ్‌ స్టడీ తనకు ఎంతో ఉపకరించిందని తెలిపింది. భవిష్యత్‌లో ఐఏఎస్‌ కావాలన్నదే తన కల అని సంజన పేర్కొంది. కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని తెలియగానే తండ్రి  ఆమెను మేళతాళాలతో ఊరేగించారు. 

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట

#

Tags : 1

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)