Breaking News

బీహార్‌లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల

Published on Mon, 06/02/2025 - 12:06

పట్నా: లైంగిక దుశ్చర్యలకు పాల్పడే నరరూప రాక్షసులపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో తొమ్మిదేళ్ల దళిత బాలిక(Dalit girl)పై అత్యాచారం జరిగింది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి  బాధితురాలి గొంతు కోసి పారిపోయాడు. బాధిత బాలిక అర్థనగ్నంగా, రక్తసిక్తమైన స్థితిలో ఉండగా, ఆమె తల్లి గుర్తించింది. వెంటనే బాధితురాలని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తరువాత మెగురైన చికిత్స కోసం పట్నాకు తరలించారు.

అయితే ఇక్కడ ఇంతకన్నా దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు చికిత్స కోసం పట్నా మెడికల్ కాలేజ్ వెలుపల ఆరు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలిక చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందడడం అందరిలోనూ తీవ్ర ఆవేదనను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రోహిత్ సాహ్ని  బాధిత బాలికకు చిరుతిండి ఆశ చూపి ఆకర్షించాడు. తర్వాత నిందితుడు ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, గొంతు కోసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాధిత బాలిక తల్లి నిద్రపోతోంది. మెలకువ వచ్చాక ఆమె తన కుమార్తె కోసం వెదికింది. పొరుగింటి వారు సాహ్ని ఆమెను తీసుకువెళ్లాడని చెప్పారు.

కొద్దిసేపటికి ఆమెకు కుమార్తె తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. వెంటనే బాధితురాలిని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ(Sri Krishna Medical College) ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం పట్నాలోని పీఎంసీహెచ్‌కు పంపారు. అయితే అక్కడ బెడ్‌ అందుబాటులో లేకపోవడంతో బాధితురాలు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని, చికిత్సలో జాప్యం కారణంగానే తమ అమ్మాయి చనిపోయిందని వారు చెబుతున్నారు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ వాదనను ఖండించారు.

పిఎంసిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ అభిజిత్ సింగ్ మాట్లాడుతూ బాధిత బాలికకు సరైన వైద్య సహాయం అందించామని చెప్పారు. చికిత్సలో జాప్యం జరిగిందని చేస్తున్న వాదన నిరాధారమైనదన్నారు. బాధితురాలికి ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందించామని తెలిపారు. ఈ విషాద ఘటనపై  బీహార్‌ ప్రతిపక్ష ఆర్జేడీ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులరాలికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం  చేయడయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బాధిత బాలిక ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)