Breaking News

చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్‌

Published on Mon, 07/31/2023 - 06:16

న్యూఢిల్లీ: దేశంలో చిన్నారుల అక్రమ రవాణాలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్‌ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో 68 శాతం పెరుగుదల నమోదైంది. 2016–22 సంవత్సరాల మధ్య గణాంకాల ఆధారంగా ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జిల్లా వారీగా చూస్తే.. దేశంలోనే అత్యధికంగా జైపూర్‌ సిటీలో అత్యధికంగా చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. టాప్‌ నాలుగు జిల్లాల్లో దేశ రాజధాని ఢిల్లీ  ఉండటం గమనార్హం.

2016–22 మధ్య 18 ఏళ్లలోపు 13,549 మంది చిన్నారులను అక్రమ రవాణా నుంచి రక్షించగలిగారు. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 2 శాతం మంది ఉండటం ఆందోళన కలిగించే అంశమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. చిన్నారులను అత్యధికంగా పరిశ్రమల్లోనే వినియోగిస్తున్నట్లు తేలింది. హోటల్, ధాబాల్లో ఉండే సిబ్బందిలో 15.6% మంది, రవాణారంగంలో 13% మంది, వస్త్ర రంగంలో 11.18% మంది చిన్నారులు పనిచేస్తున్నారు. కాస్మెటిక్స్‌ పరిశ్రమల్లో 5, 8 ఏళ్ల బాలల్ని  వాడుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. కోవిడ్‌ అనంతరం చిన్నారులను పనిలో పెట్టుకోవడం అనేక రెట్లు పెరిగింది. కర్ణాటకలో చైల్డ్‌ ట్రాíఫికింగ్‌ 18 రెట్లు ఎక్కువైనట్లు  వెల్లడించింది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)