Breaking News

నిన్న భార్య.. నేడు భర్త.. రెండు నెలలకే విషాదాంతం

Published on Sun, 12/28/2025 - 08:13

యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్‌ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్‌ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.  

అట్టహాసంగా పెళ్లయితే.. 
గానవి, సూరజ్‌ (30)లకు అక్టోబర్‌ 29న బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది.  

నాగపూర్‌కు వెళ్లిపోయి..  
గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్‌ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్‌ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్‌ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.

గానవి తల్లి ఏమన్నారు?  
సూరజ్‌ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్‌ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్‌ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. 

 భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)