Breaking News

మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి దెబ్బ

Published on Wed, 01/07/2026 - 12:55

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  లొంగిపోయిన వారిలో 7 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

లొంగిపోయిన వారిలో ఒకరు సీవైపీసిఎం, ఒకరు డీవీసీఎం, ముగ్గురు పీపీసిఎం, ముగ్గురు ఏసియం, అలాగే 18 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మొత్తం మీద వీరిపై రూ. 64 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. ‘పూనా మార్గం ప్రచారం ప్రభావంతో మావోయిస్టులు తమ పాత మార్గాన్ని వదిలి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సమాజంలో శాంతి, అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం సంతోషకరం’ అని పేర్కొన్నారు.

పోలీసుల వ్యూహం ఫలించింది
సుక్మా జిల్లాలో గత కొంతకాలంగా పోలీసులు సమాజంలో కలిసిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పూనా మార్గం ప్రచారం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యూహం ఫలితంగా మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి, శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వారిని సమాజంలో తిరిగి కలిపి, సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. 

సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోవడం, ఛత్తీస్గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పూనా మార్గం ప్రచారం, పోలీసుల వ్యూహం, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయి. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)