Breaking News

యూపీలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి!

Published on Sun, 03/10/2024 - 10:32

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్‌పూర్‌ నుంచి కెరకట్‌ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి  ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్‌, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)