Breaking News

మోడల్ ఖుష్బూ దారుణ హత్య, పరారీలో ప్రియుడు

Published on Mon, 11/10/2025 - 20:10

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మోడల్ ఖుష్బూ అహిర్వర్ అనుమానాస్పద మరణం కలకలం రేపింది. ఖుష్బూ ఖుషీగా పిలుచుకునే 21 ఏళ్ల మోడల్, ఖుష్బూ అహిర్వర్ సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలింది. దీంతో ఆమె  కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

బాధితురాలి తల్లి లక్ష్మీ అహిర్వర్ తన కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తోంది. ప్రైవేట్ భాగాలు ,  శరీరం అంతటా నీలిరంగు మచ్చలు ఉన్నాయనీ ముఖం ఉబ్బి ఉందనీ, తన కుమార్తెను దారుణంగా కొట్టి చంపారు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.  ఆమెను హత్య చేసిన వారిని  శిక్షించాలని, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ జోక్యం చేసుకోవాలని  ఆమె సోదరి డిమాండ్‌ చేసింది.  

ఆమె కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం, ఖుష్బూ 27 ఏళ్ల ఖాసిం అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. చివరిగా అతనే ఆమెను ఆసుపత్రిలో వదిలి వెళ్లాడు. అప్పటినుంచి అతడు పరారీలో ఉన్నాడు. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.  పరారీలో ఉన్న ఖాసిం కోసం గాలింపు ప్రారంభించారు. ఖుష్బూ గాయాల స్వభావం దాడి, లైంగిక హింసకు సంబంధించిన అనుమానాలను  కలిగిస్తోందని పోలీసులు  అధికారులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని, లైంగిక దాడి , హత్యతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామనితెలిపారు.

@DiamondGirl30 అనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. భోపాల్ మోడలింగ్ రంగంలో ఇపుడిపుడే రాణిస్తోంది. బీఏ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి గత మూడేళ్లుగా భోపాల్‌లో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, మోడలింగ్‌లో అవకాశాలను  దక్కించుకుంటోంది. గత మూడు రోజుల క్రితం కుటుంబంతో మాట్లాడింది. 

చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)