హత్రాస్‌ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్‌

Published on Sun, 07/07/2024 - 17:21

న్యూఢిల్లీ: హత్రాస్‌ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్‌ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్‌ సత్సంగ్‌లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్‌ తెలిపారు. 

ఆదివారం(జులై 7) ఢిల్లీలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్‌ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. 

తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్‌ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్‌ కోరారు.

జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో  ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జ్యుడీషియల్‌ కమిషన్‌ను కూడా నియమించింది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)