పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి

Published on Sun, 01/11/2026 - 01:55

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఢిల్లీలోని అశోక్‌ హోటల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్రీ–బడ్జెట్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్‌ భారత్‌’లక్ష్య సాధనలో తెలంగాణ పాత్రను వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల అనుమతులపై భట్టి నివేదిక సమరి్పంచారు.  

కేంద్రం తోడ్పాటు అందించాలి... 
దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5.1 శాతంగా ఉందని, దీన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్‌–2047’విజన్‌ను రూపొందించామని, దీని ద్వారా ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని, ఇందుకు రాష్ట్రంలో పెట్టుబడి రేటును ప్రస్తుతమున్న 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్డీపీలో) పెంచాల్సి ఉందని, దీనికి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. 

పన్నుల పంపిణీలో అన్యాయం... 
రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 41 శాతం వాటా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా సిఫారసు చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం 30 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం విధిస్తున్న సెస్సులు, సర్‌ చార్జీల వాటా 20 శాతానికి చేరడమే ఇందుకు కారణమన్నారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్‌ చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా పంచాలని ఆయన సూచించారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రాల వాటాను తగ్గించి, ఆ నిధులను (దాదాపు రూ.2.21 లక్షల కోట్లు) నేరుగా రాష్ట్రాలకే బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రాల ఆర్థిక వెసులుబాటు కోసం ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలని భట్టి డిమాండ్‌ చేశారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు.

భారీ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కోసం... 
రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని భట్టి కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని స్పష్టం చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.14,100 కోట్లు, హైదరాబాద్‌లో రేడియల్‌ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలని భట్టి తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)