Breaking News

ఆ కళారూపం అద్వితీయం

Published on Sun, 12/21/2025 - 16:28

ఒక పది సెకన్లపాటు నీటమునిగితే అమ్మె, ఆ, ఊ, హే అంటూ ఎంతో ఇబ్బంది పడతాం కదూ. ఎందుకంటే నీటిలో మునిగితే శరీరానికి ప్రాణవాయువు అందక ప్రాణం తల్లడిల్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా 20 అడుగుల నీటి లోతులో భరత నాట్యం చేసి అందరిని సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది.  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా  మారిన ఈ వీడియోన చూసిన నెటిజన్లు  ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్లాస్టిక్ వల్ల కలిగే హాని ఎలాంటిదో అందరికీ తెలుసు అయినప్పటికీ దాని వాడకాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు ఇతర హానికరమైన వస్తువులు సముద్రగర్భంలో పడేయడం ద్వారా జలగర్భంలో నివసించే ఎన్నో రకాల ప్రాణులకు హాని కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినా ఆ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. అయితే సముద్ర కాలుష్యం వల్ల జల చరాలకు కలిగే హాని, ఇతర ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఓ 11ఏళ్ల చిన్నారి టీఏ తారగై ఆరాధన వినూత్న ప్రయత్నం చేసింది.

తమిళనాడులోని రామేశ్వరం సముద్రతీరంలో 20 అడుగుల లోతులో ఆరాధన భరత నాట్య ప్రదర్శన చేసింది. నీటి అడుగునా ప్రాణవాయువు అందకున్నా తన ప్రదర్శనలో ఆ బాలిక ఏటువంచి అసౌకర్యానికి లోను కాలేదు. సాధారణ ప్రదేశంలో నృత్యం చేసిన మాదిరిగానే నీటిలోనూ తన కళను ప్రదర్శించింది. భరత నాట్యంలోని వివిధ భంగిమలు చేస్తూ అందరిని ఔరా ‍అనిపించింది.

ఆరాధన తండ్రి ప్రొఫెషనల్ డీప్-సీ- డైవింగ్ కోచ్ దీంతో తన తన పిల్లలైన టీఏ తారగై ఆరాధన, ఎస్‌డీ అశ్విన్‌ బాలకు శ్వాస నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో వారు సులువుగా ఈ ప్రదర్శన చేయగలుగుతున్నారు.  ప్రస్తుతం తారగై ఆరాధన సముద్ర గర్భంలో చేసిన భరత నాట్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Videos

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)