‘స్టార్టప్‌ ఇండియా’ లోపభూయిష్టం

Published on Sat, 03/09/2024 - 05:50

గోధ్రా(గుజరాత్‌): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచి్చన ‘స్టార్టప్‌ ఇండియా’ విధానం సరిగ్గా లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ విధానం ఫలితంగా దేశంలో ఒక్కటంటే ఒక్క స్టార్టప్‌ కూడా లేదన్నారు. ఉన్నవి కూడా విదేశీ సంస్థల నియంత్రణలోనే నడుస్తున్నాయన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర శుక్రవారం గుజరాత్‌లోని గోధ్రాకు చేరుకుంది.

స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, కారి్మకులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జోడో యాత్ర గురువారం రాజస్తాన్‌ నుంచి దహోద్‌ వద్ద గుజరాత్‌లో ప్రవేశించింది.

రాత్రి దాహోద్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఝాలోడ్‌ పట్టణ సమీపంలోని కుంబోయి దామ్‌లో గిరిజనులకు ఆరాధ్యుడైన గోవింద్‌ గురుకు నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలు అందజేసిన భారీ కేక్‌ను తన ఎస్‌యూవీ పైనుంచే రాహుల్‌ కట్‌ చేశారు. గోధ్రాకు వస్తూ శివాలయంలో ఆయన పూజలు చేశారు. గోధ్రా నుంచి సాయంత్రం పావగఢ్‌కు చేరుకుని మా కొడియార్‌ ఆలయంలో పూజలు చేశారు. పంచ్‌మహల్‌ జిల్లా జంబుఘోడా గ్రామంలో రాత్రి బస చేశారు.  
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)