Breaking News

విగ్రహాల ధ్వంసంపై ఆందోళన.. నిందితుడు అరెస్ట్‌

Published on Sun, 10/20/2024 - 12:41

భాగల్‌పూర్‌: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.

విగ్రహాల ధ్వంసం దరిమిలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా సంహౌలా ప్రధాన మార్కెట్‌ను మూసివేశారు.  పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రమేయమున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

భాగల్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంహౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఒక ఆలయంలో  కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని, పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. వదంతులకు దూరంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు. 

ఇది కూడా చదవండి: నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు