Breaking News

భారత్‌ను తీవ్రవాదంలోకి లాగేందుకు పాక్‌ కుట్ర: మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు

Published on Wed, 08/27/2025 - 07:41

మోవ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు. భారతదేశ సైనిక వ్యవహారాల మొదటి త్రి-సేవా సెమినార్ ‘రణ్ సంవాద్ 2025’లో విశ్వసరావు  ఈ విధంగా వ్యాఖ్యానించారు.

పహల్గామ్‌లో జరిగిన ఊచకోతను ‘ఉద్దేశపూర్వక రెచ్చగొట్టడం’గా సీనియర్ అధికారి విశ్వసరావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారని, ‘ప్రధాని మోదీకి ఈ సందేశాన్ని తెలియజేయాలని’ ప్రాణాలతో బయటపడిన వారికి సూచించారని ఆయన అన్నారు. భారతదేశంలో మతపరమైన, రాజకీయ అంతరాలను సృష్టించడమే కాకుండా, భారత్‌ మరోమారు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించేలా ఆకర్షించడమే పాకిస్తాన్‌ లక్ష్యం కావచ్చని ఆయన అన్నారు.

ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక సంస్థ హస్తం ఉందని మన రక్షణ, నిఘా వర్గాలు  ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని విశ్వసరావు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పన్నిన ఎత్తుగడ ఇది అని అన్నారు. 2019 పుల్వామా దాడి సమయంలో ఐఎస్‌ఐకి నాయకత్వం వహించిన మునీర్.. కశ్మీర్ సమస్యను తిరిగి లేవనెత్తేందుకు చేసిన చర్య ఇది అని విశ్వసరావు పేర్కొన్నారు. భారత దేశాన్ని  అస్థిరపరిచేందుకు  ఇటువంటి చర్యలకు పాక్‌ పాల్పడుతున్నదన్నారు.

దేశంలో జరిగిన రైతుల ఆందోళన, సీఏఏ వ్యతిరేక నిరసనలు, మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతి ఉద్యమాలను మొదలైన అంశాలను శత్రు శక్తులు ఉపయోగించుకుంటున్నాయని విశ్వసరావు అన్నారు. పాక్‌ అనుసరిస్తున్న వ్యూహాలను బంగ్లాదేశ్ తదితర దేశాలలో కనిపించే వర్ణ విప్లవాలతో విశ్వసరావు పోల్చారు. ఇటువంటి అశాంతి.. భారత దేశాన్ని  అంతర్గతంగా బలహీనపరచడానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అప్రమత్తం కావాలని మేజర్ జనరల్ విశ్వసరావు పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)