Breaking News

ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

Published on Thu, 12/04/2025 - 15:13

బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది.  నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో  మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే  ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు.  ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు  (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి.  వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. 

నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని  పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి  పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు  నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని  పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!


 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)