Breaking News

‘డాన్స్‌ కోసం పుట్టి.. ప్రొఫెసర్‌ అయ్యారు’

Published on Mon, 03/24/2025 - 10:08

బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్‌ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్‌ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.

గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్‌) విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్‌ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్‌లో ప్రొఫెసర్‌ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుంది.

ఈ వీడియోను చూసిన యూజర్స్‌ సోషల్‌ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్‌ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్‌గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు  ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. 
 


ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట 

 

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)