Breaking News

సీఈఓకు చేదు అనుభ‌వం.. ఆటోలో ప్రయాణం, బెంగళూరులో ఇంత దారుణమా!

Published on Tue, 07/25/2023 - 12:06

ముంబై: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటినగరాల్లో జీవన వ్యయం చాలా ఖరీదు అనే సంగతి తెలిసిందే.  ఈ నగరాల్లో సామాన్య ప్రజలు జీవించాలంటే అంత సులువు కాదు. అయితే తాజాగా ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ సీఈఓ.. ఈ నగరాల్లో కూడా ఖర్చుల పరంగా వ్యత్యాసం ఉందని నిరూపిస్తూ ఓ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరులో ఇంత దారుణమా
సాధారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కేటగిరిలో ఆటో డ్రైవర్ల గురించే చెప్పుకొవాలి. దూరం, ఆటోలోని మీటర్‌ను బట్టి కాకుండా ప్రాంతాన్ని బట్టి వారు ధరలను నిర్ణయిస్తుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే ఓ సీఈఓకి ఎదురైంది. బెంగళూరులో కేవలం 500 మీటర్ల ప్రయాణించగా.. అతని నుంచి ఆటో డ్రైవర్‌ రూ.100 వసూలు చేసినట్లు తెలిపాడు. అదే తాను ముంబైలో 500 మీటర్లకు కేవలం రూ.9 ఆటో ఫేర్ చెల్లించేవాడని చెప్పుకొచ్చాడు. బెంగళూరులో మరీ ఇంత దారుణమా అంటూ వాపోయాడు.

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్  ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అందుకే ఏమో ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వాటిని వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 చెల్లించా.. అదే ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు.. బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఇంకా ఇబ్బందిగా ఉంటుందని ఒకరు కామెంట్‌ చేశారు. ఈ  దోపిడీ చట్టబద్ధం కాదనిపిస్తోందని కామెంట్‌ చేయగా, మరొక యూజర్‌ ..చాలా తక్కువ నగరాల్లో ఆటో-మీటర్ ఛార్జీల వ్యవస్థ ఉంది. కానీ నగరాల్లో ఇలాంటివి ఆశించకూడదని కామెంట్‌ పెట్టాడు. 

చదవండి  ఐఆర్‌సీటీసీ డౌన్‌, యూజర్లు గగ్గోలు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)