Breaking News

బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!

Published on Wed, 01/11/2023 - 11:18

మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్‌ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్‌పై వెళ్తున్నాం. వారిని స్కూల్‌ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది.

వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్‌ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్‌  ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్‌కుమార్‌ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్‌ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్‌  లైసెన్స్‌ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు.

అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్‌ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్‌కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు.

అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్‌ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా.  

(చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)