Breaking News

చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త

Published on Sat, 12/13/2025 - 14:16

ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్‌ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా  కాపాడుకుంటారు.  కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు.  మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి  ఎగిరిపోయి,  సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్‌ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్‌ కుమార్‌కి  వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)