స్నేహితుల పందెం.. బాణాసంచా డబ్బాపై కూర్చొని వ్యక్తి మృతి

Published on Mon, 11/04/2024 - 19:40

స్నేహితులతో చేసిన సరదా పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. బెంగళూరులో కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్న స్నేహితుడికి ఆటో కొనిస్తామని ఆశపెట్టి అతడి మృతికి కారణమయ్యారు. దీపావళి రోజు బాణాసంచాతో నిండిన డబ్బాపై కూర్చుంటే ఆటో కొనిస్తామని ఆశపెట్టారు. 

అయితే అధిక మొత్తంలో బాంబులు ఒకేసారి పేలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటన బెంగళూరు- కోననకుంటెలో చోటుచేసుకుంది. కోననకుంటెలో  అక్టోబర్‌ 31న దీపావళి సందర్భంగా . శబరీష్‌, అతని స్నేహితులతో కలిసి టపాసులు కాల్చుతున్నారు.

మద్యం మత్తులో ఉన్న శబరీష్‌ను  బాణాసంచా పెట్టిన డబ్బాపై కూర్చుంటే ఆక్షా కొనిస్తామని స్నేహితులు ఆశచూపారు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న శబరీష్‌ కొత్త ఆటో వస్తది కదా అని అనుకొని ఆ సవాల్‌ను స్వీకరించాడు. పందెం ప్రకారం  శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు.ఆ తర్వాత ఆ ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లారు.

శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మరణించాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని ఆఖరికి ప్రాణాలు వదిలాడు.  దీనికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)