Breaking News

30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్‌

Published on Wed, 08/13/2025 - 08:44

కర్ణాటక: వారిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒక‌రు స్నేహితుడి భార్య‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డంతో చిచ్చు రేగింది. ఫ‌లితంగా ఇద్ద‌రు మిత్రుల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు హత్య కేసులో ఇరుక్కున్నాడు.

విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవ‌ర్ కాగా, విజ‌య్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువ‌తిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ క‌ల్లోలం రేపాడు. విజ‌య్ భార్య ఆశ‌తో వివాహేత‌రం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం తెలియ‌డంతో విజ‌య్ త‌న కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధ‌నంజ‌య‌ ఎఫైర్ కొన‌సాగించ‌డంతో పంచాయితీ పోలీసుల‌కు వ‌ద్ద‌కు చేరింది. ఇరువ‌ర్గాల‌కు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.

మరోవైపు త‌న సంసారంలో నిప్పులు పోసిన‌ ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్‌ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అత‌డు అన్నంత ప‌ని చేస్తాడ‌నే భ‌యంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్‌ వేశాడు. సోమవారం రాత్రి విజయ్‌కుమార్‌ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి  విజయ్‌కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్‌, అత‌డి గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)