Breaking News

కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..

Published on Fri, 06/20/2025 - 09:26

బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్‌లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్‌నగర వద్ద దార్‌బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్‌ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.

గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్‌ కెవిన్‌, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్‌ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్‌లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్‌కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్‌బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్‌ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.

బస్సు టికెట్లే క్లూ..
మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.

అనుమానంతో హత్య: ఎస్పీ
దక్షిణ గోవా ఎస్పీ తికమ్‌సింగ్‌ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్‌ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)