Breaking News

Bengaluru: సఫారీ వాహనంపైకి దూకి.. బాలునిపై చిరుత దాడి

Published on Sat, 08/16/2025 - 13:56

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో గల బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో  కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్క్‌లో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు. జంతువులను వీక్షించేందుకు  సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఆగగానే, ఒక చిరుత  ఆ వాహనంపైకి దూకి, కిటికీ గుండా బాలునిపై దాని పంజాతో గాయపరిచింది. అధికారులు బాధిత బాలుడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

బాధిత బాలుడు సుహాస్.. బొమ్మసంద్ర నివాసి. తన తల్లిదండ్రులతో కలిసి సెలవు రోజున బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో సఫారీకి బయలుదేరాడు. సోషల్‌ మీడియాలో  ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ ఘటన దరిమిలా బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘శ్రీఎక్స్‌’ పోస్టులో.. చిరుతపులి సఫారీ జోన్ లో.. నాన్ ఏసి బస్సు సఫారీ జరుగుతుండగా, 12 ఏళ్ల బాలునిపై చిరుత దాడి చేసిందన్నారు.  

బాలునికి వెంటనే ప్రధమ చికిత్స అందించారన్నారు. సఫారీ వాహనంలోని కెమెరా స్లాట్‌లతో సహా అన్ని విండో గ్రిల్‌లను సురక్షితంగా కవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాన్-ఎసి సఫారీ బస్సుల డ్రైవర్లు  అత్యంత జాగ్రత్తగా ఉండాలని  సూచనలు జారీ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. బన్నెర్ఘట్ట జూలాజికల్ పార్క్‌లోని వన్యప్రాణుల సఫారీ పర్యాటకులను ఎంతగానే ఆకర్షిస్తుంటుంది. కాగా  ఈ పార్కులోని చిరుతలు, ఏనుగులు తరచూ, నగర శివార్లలోని నివాస ప్రాంతాలలోపికి ప్రవేశిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు