Breaking News

ఆమెకు 35.. అతడికి 25.. జాతరలో పరిచయం కాస్తా..

Published on Mon, 06/09/2025 - 13:07

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు 36, అతడికి 25 ఏళ్లు కాగా.. ఓయో హోటల్‌ రూమ్‌లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి(36), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం​ కెంగేరిలో జాతర జరిగింది. ఈ జాతరకు హరిణి వెళ్లింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యశస్‌ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో.. అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో.. వారిద్దరికి పరిచయం ఏర్పడింది. జాతరలోనే ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో మరింత సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం, దాసేగౌడ.. ఆమె వద్ద నుంచి ఫోన్‌ తీసుకున్నాడు. వారి మధ్య కమ్యూనికేషన్‌ లేకుండా చేశాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని తనను క్షమించాలని కోరింది. ఆమెను నమ్మిన భర్త.. ఫోన్‌ ఇవ్వడంతో.. మళ్లీ హరిణితో యశస్‌ కంటాక్ట్‌లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్‌ చేసి బెంగళూరులోని ఓ హోటల్‌ గదికి పిలిచాడు. దీంతో, శుక్రవారం వీరద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓయో హోటల్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. గదిలో ఉన్న సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

హరిణి తనతో పాటే ఉండాలని యశస్‌ పట్టుబట్టాడు. తాను లేకుండా జీవించలేనని.. తనతోనే ఉండాలన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆవేశానికి గురైన యశస్‌.. హరిణిని దారుణంగా హత్య చేశాడు. హరిణిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత యశస్‌ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)