కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు
Breaking News
ప్రేమికుల డ్రగ్స్ దందా.. సహజీవనం చేస్తూ.. డాన్‌గా ఎదగాలని
Published on Sun, 12/04/2022 - 08:03
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ దందా చేస్తున్న కేరళకు చెందిన ప్రేమికులను శనివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 25 లక్షల విలువైన డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్నారు. చందాపురలోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్న సిగిల్ వర్గీస్, విష్ణుప్రియాను పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ ఎస్‌టీ శరణప్ప తెలిపారు.
ఓ అంతర్జాతీయ పెడ్లర్‌ను రోల్‌మాడల్‌గా చేసుకుని వీరు డాన్‌గా ఎదగాలని మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేలింది. నిరి్ధష్టమైన స్థలాల్లో డ్రగ్స్ ఉంచి కస్టమర్లకు లొకేషన్ షేర్ చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వసూలు చేసుకునేవారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 100 గ్రాములు ఎండీఎంఏ, 150 గ్రాములు ఎస్‌ఎల్‌డీ మాత్రలు, డ్రగ్స్ వ్యవహారాల డైరీ, ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్ ఫొటోలను స్వాధీనం చేసుకున్నామని శరణప్ప తెలిపారు.
చదవండి: (సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు హరి కన్నుమూత)
Tags : 1