West Bengal: క్రీడాశాఖ మంత్రి రాజీనామా

Published on Tue, 12/16/2025 - 15:38

ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ  క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్‌ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు. 

ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.

లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం.

 


 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)