Breaking News

West Bengal: తుది ‘జాబితా’ విడుదల.. ఓటర్లలో టెన్షన్‌!

Published on Sat, 02/28/2026 - 13:05

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనున్న తరుణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)లోని తుది ఓటర్ల జాబితా శనివారం అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికంటే ముందే నేరుగా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రదర్శించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ కోలాహలం నెలకొంది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజాము నుంచే ఓటర్ల జాబితా హార్డ్ కాపీలను జిల్లా మేజిస్ట్రేట్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు చేరవేశారు. అక్కడి నుంచి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) విడతల వారీగా ఈ జాబితాలను సేకరించి, ఆయా కేంద్రాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఈ సవరణ ప్రక్రియలో దాదాపు 60 లక్షల మంది ఓటర్ల పేర్లపై సందిగ్ధత నెలకొనడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఈ పేర్లను ‘పరిశీలన’ విభాగంలో ఉంచారు. తాజాగా విడుదలైన తుది జాబితాలో వారిలో ఎంతమంది పేర్లు మనుగడలో ఉన్నాయి? ఇంకెంతమంది పేర్లు తొలగించారనే అంశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జాబితా అప్‌లోడ్ అయ్యేలోపు క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచేందుకే ఆఫ్‌లైన్ పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ, ఓటర్లలో నెలకొన్న ఉత్కంఠ కారణంగా పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కు సురక్షితంగా ఉందో లేదోనన్న ఆందోళన ఓటర్లలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పరిణామం బెంగాల్ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. తుది జాబితా వెలువడటంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ బూత్‌ల వారీగా డేటాను విశ్లేషించేందుకు పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయికి చేరుకున్నారు.

ఓట్ల తొలగింపుపై అప్పుడే ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. స్వల్ప మార్పులు కూడా గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంతో, తమ పార్టీ మద్దతుదారులైన ఓట్లర్ల పేర్లను నిర్ధారించుకునే పనిలో పడ్డారు. ఎన్నికల సంఘం మాత్రం పారదర్శకతే తమ ప్రధమ కర్తవ్యమని పునరుద్ఘాటించింది. అర్హులైన ఓటర్ల పేర్లు ఎవరివైనా జాబితాలో లేకపోయినా లేదా ఏవైనా తప్పులున్నా తక్షణమే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)