Breaking News

ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..

Published on Mon, 05/05/2025 - 09:05

ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.

వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్‌ షేక్‌ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.

అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్‌ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)