Breaking News

సుప్రీం డెడ్‌లైన్‌ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్‌ డాక్ట్టర్లు

Published on Wed, 09/11/2024 - 02:15

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్‌ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్‌కతా పోలీస్‌ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్‌ రాజీనామా కోసం వారు డిమాండ్‌ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.

నేటి విచారణకు హాజరు కండి
బుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.

చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు 
సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్‌ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్‌ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్‌ దేబాశిష్‌ హల్దార్‌ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.

సందీప్‌ ఘోష్‌ కస్టడీ పొడిగింపు
ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్‌ అలీ, సన్నిహితులు బిప్లవ్‌ సిన్హా, సుమన్‌ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)