Breaking News

దుర్గా పూజలో విషాదం : మహిళ మృతి.. పోలీసుల నిర్లక్ష్యం?

Published on Wed, 10/01/2025 - 12:01

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అంతటా ప్రస్తుతం  అత్యంత వేడుకగా దుర్గా పూజలు జరుగుతున్నాయి. అయితే కోల్‌కతాలోని ఒక దుర్గా పూజా మండపంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి పూజలు జరుగుతున్న ఒక మండపానికి వచ్చిన మహిళ అనారోగ్యానికి గురై, మృతిచెందింది. అయితే మృతురాలి కుటుంబీకులు ఈ ఘటనకు పోలీసుల నిరక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

‘ఏబీపీ ఆనంద’లోని వివరాల ప్రకారం కోల్‌కతాలోని ‘బెహలా నూతన్‌ దాల్‌’ దుర్గామాత పూజా మండపానికి వచ్చిన సంగీత రాణా అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాధితురాలికి వెంటనే సీపీఆర్‌ అందించారు. అయినా ఆమె పరిస్థితి విషమించడంతో విద్యాసాగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. అనంతరం అమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా సంగీత దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతురాలి బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలికి ఆక్సిజన్ అందించాలని తాము పదేపదే అభ్యర్థించినప్పటికీ పోలీసులు  స్పందించలేదని ఆరోపించారు. అలాగే బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యాలు లేవు’ అని  ఆరోపించారు. అయితే ఈ వాదనను పోలీసులు ఖండించారు. ఇదిలావుండగా బీజేపీ నేత సజల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జనాన్ని అదుపుచేయడంలో, వారికి సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా డయల్‌ 100కు దుర్గా మండపాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు వస్తున్నాయని డీసీ సెంట్రల్ ఇందిరా ముఖర్జీ తెలిపారు. విపరీతమైన శబ్ధాల కారణంగా పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)