Breaking News

బౌద్ధసన్యాసికి భిక్షవేసి కాళ్లు మొక్కిన యాచకుడు : వీడియో వైరల్‌

Published on Wed, 10/28/2026 - 17:06

బిహార్‌లోని గయా జిల్లా మహాబోధి ఆలయం వద్ద జరిగిన ఒక అత్యంత భావోద్వేగపూరితమైన సంఘటన పలువురి హృదయాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. అవసరంలో ఉన్నవారి పట్ల దయ చూపడం, బౌద్ధ సన్యాసులను గౌరవించడం, నిస్వార్ధ సేవ బుద్ధుని బోధనల సారాంశం. ప్రతి ఒక్కరి జీవితం ఆనందం, శాంతి దయతో నిండి ఉండాలని బుద్దుని ఆరాధకులునమ్ముతారు. కానీ మహాబోధి ఆలయ సమీపంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 57 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 3.6 కోట్లకు  పైగా వ్యూస్  రావడం విశేషం.

రోడ్డు పక్కన కూర్చున్న ఒక దివ్యాంగుడైన యాచకుడు, ఆ దారిలో పాత్రలు పట్టుకుని వెళ్తున్న ఒక థాయ్ బౌద్ధ సన్యాసికి తన జేబులో ఉన్న కొన్ని నాణేలను, తన వద్ద ఉన్న ఆహారాన్ని భిక్షగా సన్యాసి భిక్షా పాత్రలో వేశాడు.  అంతేకాదు  దానం చేసిన అనంతరం ఆ యాచకుడు తన టోపీ తీసి సన్యాసి కాళ్లకు నమస్కరించి గౌరవించాడు. దీంతో బౌద్ధ సన్యాసి  ముగ్దుడై,  నీళ్ల బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లుతోపాటు కొన్ని డబ్బులను తిరిగి అందించి, అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. 

ఇదీ చదవండి: రూ. 20 కచోరి తిందామని ఆగితే.. రూ. 20 లక్షలు మాయం!


 

బోధి ఫౌండేషన్  స్పందన
మానవత్వమే గొప్ప మతం. అవసరంలో ఉన్నవారికి దయతో సహాయం చేయడాన్నిమించిన దైవ సేవ మరొకటి ఉండదు అంటూ  బోధి ఫౌండేషన్‌కు చెందిన రాకేష్ ఈ వీడియోను షేర్ చేస్తూ  వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జిమ్‌ ట్రైనర్‌తో లవ్‌.. భర్తపై హత్యాయత్నం : కట్‌ చేస్తే..!

నెటిజన్ల స్పందన
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు.  "రెండో ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసిన ఆ దివ్యాంగుడిని అభినందిస్తున్నాను .అలా అతను తాను  ఎంత గొప్పవాడో చాటుకున్నాడు." అని ఒకరు, డబ్బుతో సంబంధం లేదు, దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి, అని కొందరు, "ఆస్తిపరంగా కాకపోయినా మానవత్వంలో అతనే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు" అని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)