Breaking News

రాహుల్‌ గాంధీకి కోర్టు నోటీసులు

Published on Sun, 12/22/2024 - 12:24

లక్నో : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.  

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్‌ పాఠక్‌ అనే వ్యక్తి న్యాయ  స్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని, న్యాయపరమైన జోక్యం అవసరమని ఆరోపిస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందుగా ప్రత్యేక ఎంపీ,ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో తాజాగా తాను జిల్లా కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ గాంధీకి నోటీసులు పంపినట్లు పిటిషనర్‌ తెలిపారు.

 హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో
హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్‌ గాందీ మాట్లాడారు. బీజేపీపై విమర్శులు గుప్పిస్తూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. “ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మొదట దేశవ్యాప్త కుల గణనను నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తాం’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్‌ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)