Breaking News

గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు

Published on Thu, 06/29/2023 - 13:59

లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి  ఘటన ఒకటి యూపీలో జరిగింది. 

దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో..  ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్‌ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట.

ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్‌ షాక్‌ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్‌ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్‌ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. 
 

ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)