Breaking News

‘బయటకు వెళ్లి సిగరెట్‌ కాల్చుకో’ అన్నాడని..

Published on Tue, 06/13/2023 - 12:07

హెయిర్‌ కటింగ్‌ కోసం సెలూన్‌కు వెళ్లి ఒక వ్యక్తి సెలూన్‌ యజమాని కుమారునితో ‘బయటకు వెళ్లి సిగరెట్‌ కాల్చుకో’ అని అన్నాడు.  ఈ మాట విన్న ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జరుగున్న సంఘటనను అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయి చూశారు. 

దేశరాజధాని ఢిల్లీలో సిగరెట్‌ తాగే విషయంలో చోటు చేసుకున్న వివాదం దారుణానికి దారితీసింది. ఈ ఉదంతం ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో సెలూన్‌కు వచ్చిన ఒక యువకుడు అక్కడే ఉంటున్న 38 ఏళ్ల వ్యక్తిపై కత్తెరతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా  గాయపరిచాడు. అభయ్‌ కుమార్‌ అనే వ్యక్తి హెయిర్‌ కంటింగ్‌ కోసం సెలూన్‌కు వెళ్లాడు. 

అదే సమయంలో దుకాణం యజమాని కుమారుడు మెహిత్‌ మహలావత్‌(22) అక్కడికి వచ్చాడు. అతను మద్యం మత్తులో ఉండి, సిగరెట్‌ కాలుస్తున్నాడు. దీంతో  అభయ్‌ అతనితో ‘బయటకు వెళ్లి సిగరెట్‌ కాల్చుకో’అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మోహిత్‌ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడేవున్న కత్తెర తీసుకుని పలుమార్లు అభయ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో అభయ్‌ శరీరంపై 9 చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశారు.

 ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)