Breaking News

వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి..

Published on Thu, 06/11/2026 - 20:46

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్‌డోజర్‌పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్‌ సమయంలో బుల్‌డోజర్‌పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఉమ్రీ కలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు ఉస్మాన్‌ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్‌డోజర్‌ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికంటే ప్రత్యేకంగా తన బరాత్‌ చేసుకోవాలని అనుకున్నాడు.

వైరల్‌ వీడియోలో ఉ‍న్న దారి ప్రకారం ఉస్మాన్‌ తన స్నేహితులతో కలిసి బుల్‌డోజర్‌పై కూర్చొని గ్రామంలో ఊరేగింపులో పాల్గొంటూ కనిపించాడు. ఒక వీడియోలో అతను సిగరెట్‌ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.

మరో వీడియోలో పెద్ద శబ్దంతో వినిపించిన డీజే సంగీతానికి అనుగుణంగా బుల్‌డోజర్‌పై ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్‌ సభ్యులు కూడా బుల్‌డోజర్‌పైకి ఎక్కినట్లు వీడియోల్లో కనిపించింది. కదులుతున్న బుల్‌డోజర్‌పై డజన్‌కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్‌ చేస్తూ హ్యాపీగా గడిపారు.

ఈ విభిన్న పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు భద్రతాపరమైన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ఊరేగింపులో బుల్‌డోజర్‌పై డ్యాన్స్‌ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.

వీడియోలు మరింత వైరల్‌ అవుతుండడంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించారు. వీడియోల్లో కనిపించిన బుల్‌డోజర్‌ను గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై మాట్లాడిన కాంత్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు.. ఊరేగింపులో వినియోగించిన జేసీబీ యంత్రాన్ని గుర్తించామని, చలాన్‌ జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనతో జరిగే వేడుకలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని, ముఖ్యంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.

ఉస్మాన్‌ పెళ్లి బృందం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైనా, పెళ్లి తర్వాత ఊహించని గుర్తుగా ట్రాఫిక్‌ చలాన్‌ను కూడా పొందింది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)