Breaking News

30 ఏళ్లుగా భారత్‌లో ‘బంగ్లా’ ట్రాన్స్‌.. నకిలీ పత్రాలతో హల్‌చల్‌

Published on Thu, 10/16/2025 - 10:27

ముంబై: భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ను అరెస్టు చేశారు.

ట్రాన్స్ జెండర్‌ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్  ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి  సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.

శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్‌పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు  భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.

ఇదిలావుండగా  ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత  శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో  తేలింది.  

‘హైదర్‌పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు  ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)