Breaking News

హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్‌

Published on Sat, 08/17/2024 - 06:26

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్‌ యూనుస్‌ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్‌ శుక్రవారం మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. షేక్‌ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్‌ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్‌ యూనుస్‌ కాల్‌ చేశారు.

 బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్‌ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)