Breaking News

ఢాకాలో భారత హైకమిషన్‌ వద్ద కలకలం 

Published on Thu, 12/18/2025 - 05:29

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనాకు భారత్‌ ఆశ్రయం కల్పిస్తోందన్న అక్కసుతో, ఆమెను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు బుధవారం పేట్రేగిపోయారు. ఢాకాలోని ఇండియన్‌ భారత హైకమిషన్‌ను ముట్టడించేందుకు వందలాది మంది ర్యాలీగా వచ్చారు. బ్యారీకేడ్లను ఏర్పాటుచేసినా వాటిని ధ్వంసంచేసుకుంటూ నిరసకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

జూలై ఐక్యత బ్యానర్‌ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్‌కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘‘ మేం ఇండియన్‌ హైకమిషన్‌పై దాడిచేయబోం.కానీ పరోక్షంగా మా దేశాన్ని ఆధిపత్యం చెలాయించేందకు యతి్నస్తే చూస్తూ ఊరుకోం’’ అని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య ఘటనతో భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. 

ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ దౌత్యవేత్త రియాజ్‌ హమీదులాల్‌హ్‌ను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారతవిదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. ఆఫీస్‌కు వచ్చిన రియాజ్‌పై మోదీ సర్కార్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘ ఇటీవలకాలంలో బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. భారత వ్యతిరేక పుకార్లు షికార్లుచేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలనూ మాతో పంచుకోవట్లేదు’’ అని ఆయనతో కేంద్రప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తంచేసింది. 

భారత వీసా కేంద్రం మూసివేత 
పరిస్థితులు అదుపు తప్పొచ్చనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని భారత వీసా జారీ కేంద్రాన్ని మోదీ సర్కార్‌ మూసేసింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్‌ పార్క్‌లో ఈ ‘ది ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్‌(ఐవీఏసీ)’ ఉంది. ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా సెంటర్లకు ఇదే సమీకృత కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఐవీఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది.   

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)