Breaking News

Bangladesh: మరో హిందువు దారుణ హత్య

Published on Sun, 01/18/2026 - 13:40

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో మరో హిందువు దారుణ హత్య చోటుచేసుకుంది. తన దుకాణంలోని ఉద్యోగికి.. కస్టమర్లకు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక హిందూ వ్యాపారిని దుండగులు కొట్టి చంపారు. ఈ హత్య అక్కడి మైనారిటీ వర్గాలలో తీవ్ర భయాందోళనలను నింపింది. మృతుడిని 55 ఏళ్ల లిటన్ చంద్ర ఘోష్‌గా గుర్తించారు. ఇతను వైశాఖి పేరుతో స్థానికంగా  ఓ స్వీట్ షాపును నడుపుతున్నాడు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లిటన్ దుకాణంలో పనిచేసే అనంత దాస్ అనే ఉద్యోగికి.. ఒక కస్టమర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, తన సిబ్బందిని రక్షించేందుకు యజమాని లిటన్ జోక్యం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు లిటన్‌పై తిరగబడ్డారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మొదట  లిటన్‌పై పిడిగుద్దులతో దాడి చేసిన దుండగులు, అనంతరం ఒక పారతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లిటన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కలిగంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ ఎండి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రిపన్ సాహా (30) అనే హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపిన ఘటన మరువక ముందే ఈ దారుణం  చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: బాంబు బెదిరింపు.. ‘ఇండిగో’ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)