Breaking News

Maharashtra: బాల్‌ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు?‌

Published on Tue, 07/08/2025 - 07:43

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ హిందీని తప్పనిసరి చేస్తామని ప్రకటించిన దరిమిలా మరాఠీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రణాళికను.. బాల్‌థాక్రే కుమారుడు ఉద్ధవ్‌ థాక్రే, అతని సోదరుడు (బాల్‌థాక్రే అన్న కుమారుడు) రాజ్‌ థాక్రేలు ఒకే వేదికపై చేరి, తీవ్రంగా వ్యతిరేకించారు.  ఈ నేపధ్యంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషంగా మారింది. ఆ వీడియోలో భుజంపై కాషాయ శాలువా ధరించిన బాల్‌థాక్రే ‘నేను మరాఠీ వాడినే కావచ్చు.. కానీ భారతదేశంలోని హిందువును’ అని పేర్కొనడాన్ని గమనించవచ్చు. అలాగే బాషా గుర్తింపుల కన్నా హిందుత్వాన్ని స్వీకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
 

రెండు దశాబ్దాలుగా విబేధాలతో రగిలిపోతున్న ఉద్ధవ్, రాజ్ ముంబైలో ఒక వేదికపై చేరి, రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ అనంతరం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ వీడియో ప్రత్యక్షమై వైరల్‌గా మారింది. కాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హిందీని తప్పనిసరి భాషగా  ప్రవేశపెట్టే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్ధవ్, రాజ్‌లు తమ ర్యాలీలో నినదించారు.

తండ్రి రాజకీయ సిద్ధాంతానికి వారసునిగా గుర్తింపు పొందిన ఉద్ధవ్ థాక్రే కొంతకాలంగా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంపై పోరాడుతున్నారు. రాజ్, తాను కలిసి ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఇదే సమయంలో రాజ్‌ థాక్రే తన సోదరునికి మద్దతు పలుకుతూ, బీజేపీ ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేయడాన్ని తాము అనుమతించబోమని, ఈ ఉద్యమానికి మరాఠీ జనాభా ఐక్యంగా మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: ‘మహా’తీరంలో పాక్‌ నౌక?.. అంతటా హై అలర్ట్‌
 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)