Breaking News

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌

Published on Fri, 09/13/2024 - 07:35

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్‌ 13)  విచారణ చేపట్టింది. 

విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్‌ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం  వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

సీబీఐపై ప్రశ్నలు సంధించిన సుప్రీం
విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐపై విమర్శలు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి మార్చి 2023లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. విచారించిన 22 నెలల సమయం తీసుకుని కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసింది.  అరెస్ట్‌ చేసేందుకు ఎందుకు అంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. 

షరతులతో కూడిన బెయిల్‌
చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం,అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.  

ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే సంపన్న మహిళ పోటీ 

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం ఈ నెల 5వ తేదీన రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది జూన్‌ 26న సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ అరెస్టును హైకోర్టు సమర్థించింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతోపాటు బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా, శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఇవాళ తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)