Breaking News

బహ్రాయిచ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

Published on Mon, 10/14/2024 - 12:48

బహ్రాయిచ్‌: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్‌ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.

బహ్రాయిచ్‌ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మార్కెట్‌లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు.  ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.

నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. 

ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)