Breaking News

ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు

Published on Sun, 04/06/2025 - 09:42

కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్‌ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్‌ కోచ్‌ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితడు సురేశ్‌ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్‌ బాలాజీ అనే బ్యాడ్మింటన్‌ కోచ్‌ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.

ఇలా గుట్టురట్టు
ఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్‌ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్‌ఫోన్‌ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్‌ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)