Breaking News

సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్‌.. కీలక విషయలు వెల్లడి

Published on Thu, 10/24/2024 - 10:30

ముంబై: ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నేత  బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్‌ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య  మొత్తం 14 మందికి చేరింది.

హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్‌లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే  నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్‌ కుమార్‌ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్‌ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడితో నిందితుల చాట్‌

హత్యను అమలు చేయడానికి  డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్‌ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్‌ కుమార్‌ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.

నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)