Breaking News

'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్‌

Published on Fri, 06/19/2026 - 17:13

సోషల్‌మీడియాలో రోజుకో  కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్‌ లంటే చాలా  క్రేజ్‌ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్‌పై విన్యాసాలు చేయడం  చూశారా?  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో  తెగ వైరల్‌ అవుతోంది. 

కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్‌ చేశారు. రన్నింగ్ బైక్‌పై బైక్ హ్యాండిల్‌ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్‌ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు.  తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు.  ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే  ఇది  ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.

రన్నింగ్ బైక్‌పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు  తెగ సెటైర్లు వేశారు.

 

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్‌ చేశారు.

నోట్‌ : అత్యంత ప్రమాదకరమైన  ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది  సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి.  సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు  ఏదో థ్రిల్‌ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే  కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)