Breaking News

యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!

Published on Tue, 07/08/2025 - 09:31

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్‌ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)